Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: గోవిందాశ్రిత గోకులబృందా
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
గోవిందాశ్రిత గోకులబృందా |
పావన జయజయ పరమానంద ‖
జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘనరిపు భీమ |
అగణిత రఘువంశాంబుధి సోమ ‖
జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ‖
గరుడ తురంగా కారోత్తుంగా |
శరధి భంగా ఫణి శయనాంగా |
కరుణాపాంగా కమల సంగా |
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ‖
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon