కంటి నఖిలాండ మొరగులు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కంటి నఖిలాండ


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics








కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి |
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ‖


మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి |
బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ‖

పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ‖

పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ‖


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)