ఏ పురాణముల నెంత వెదికినా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఏ పురాణముల నెంత వెదికినా 


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics


ఏపురాణముల నెంత వెదికినా |
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ‖


వారివిరహితములు అవి గొన్నాల్లకు |
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ‖

కమలాక్షుని మతిగాననిచదువులు |
కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములే కాని వితథముగావు ‖

శ్రీవల్లభుగతి జేరనిపదవులు |
దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు |
పావనము లధికభాగ్యపుసిరులు ‖
Share This :sentiment_satisfied Emoticon