చాలదా బ్రహ్మమిది అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics


Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: చాలదా బ్రహ్మమిది


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics


చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు |
జాలెల్ల నడగించు సంకీర్తనం ‖

సంతోష కరమైన సంకీర్తనం |
సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం |
సంతతము దలచుడీ సంకీర్తనం ‖

సామజము గాంచినది సంకీర్తనం |
సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం |
సామాన్యమా విష్ణు సంకీర్తనం ‖

జముబారి విడిపించు సంకీర్తనం |
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం |
శమదమాదుల జేయు సంకీర్తనం ‖

జలజాసనుని నోరి సంకీర్తనం |
చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం |
చలపట్టి తలచుడీ సంకీర్తనం ‖

సరవి సంపదలిచ్చు సంకీర్తనం |
సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం |
సరుగనను దలచుడీ సంకీర్తనం ‖

Share This :sentiment_satisfied Emoticon