భావము లోన అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: భావము లోన


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics


రాగం: దేసాక్షి

భావములోనా బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా ‖

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ‖

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ‖

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ‖
Share This :sentiment_satisfied Emoticon