వినరో భాగ్యము విష్ణుకథ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: వినరో భాగ్యము విష్ణుకథ 

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ‖

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ‖

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ‖
Share This :sentiment_satisfied Emoticon