నారాయణతే నమో నమో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: నారాయణతే నమో నమో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics

రాగం: బేహాగ్
తాళం: ఆదితాళం

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ‖


మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ |
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ‖

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ |
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ‖

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప |
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ‖
Share This :sentiment_satisfied Emoticon