దేవతలారా రండి మీ దీవెనలందించండీ సాంగ్ లిరిక్స్ ఆహ్వానం (2019) తెలుగు సినిమా


Album : Aahvaanam

Starring: Srikanth, Ramya Krishnan, Heera Rajgopal
Music : S. V. Krishna Reddy
Lyrics-Sirivennela 
Singers :S P Balasubramanyam, Chitra
Producer: T. Trivikrama Rao
Director: S. V. Krishna Reddy
Year: 1997



English Script Lyrics CLIck HERE





దేవతలారా రండి మీ దీవెనలందించండీ
నోచిన నోములు పండించే
నా తోడును పంపించండీ
కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి
పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనివిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ
కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి
పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనివిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ

ఓ... శివపార్వతులేమో
ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని
మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన
పున్నమి పూలవెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి 

ఆ... తన ఎదపై రతనంలా
నిను నిలిపే మొగుడొస్తాడు
 నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
 తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు
 తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ
మెత్తని పాదం మోపిన ప్రతిచోట
నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట
Share This :



sentiment_satisfied Emoticon