పదర పదరా (భల్లుమంటు నింగి ఒళ్లు) సాంగ్ లిరిక్స్ మహేష్ బాబు మహర్షి (2019) తెలుగు సినిమా


Album : Maharshi
Starring: Mahesh Babu, Allari Naresh, Pooja Hegde,Sonal Chauhan
Music : Devi Sri Prasad
Lyrics-Srimani 
Singers :Shankar Mahadevan 
Producer: Dil Raju, Prasad V. Potluri
Director: Vamsi Paidipally
Year: 2019
English Script Lyrics CLICK HERE


భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే

పదర పదర పదరా 
నీ అడుగుకి పదును పెట్టి పదరా 
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా 
ఈ పుడమిని అడిగి చూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
నీ కథ ఇదిరా
నీ మొదలిది రా 
ఈ పథమున మొదటడుగేయిరా
నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా

పదర పదర పదరా 
నీ అడుగుకి పదును పెట్టి పదరా 
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా 
ఈ పుడమిని అడిగి చూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా

భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే

కదిలే ఈ కాలం
తన రగిలే వేదనకీ 
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం 
తన ఎదలో రోదనకీ 
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని 
తననడిగే వాడే లేక 
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదరా 
ఈ హలమును భుజము కెత్తి పదరా 
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా
పదర పదర పదరా 
ఈ వెలుగను పలుగు దించి పదరా 
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక 
మెతుకులిచ్చు కదరా

నీలో ఈ చలనం 
మరి కాదా సంచలనం 
చినుకల్లే మొదలయి 
ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జడికి 
చెలరేగే అలజడికి 
గెలుపల్లే మొదలయి 
చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని 
తమకోసమనీ తెలిసాకా 
నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ 
నినదించేలా

పదర పదర పదరా 
నీ గతముకు కొత్త జననం ఇదిరా 
నీ ఎత్తుకు తగిన లోతు ఇది 
తొలి పునాది 
గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా 
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా 
నీ ఒరవడి భవిత కలల ఒడి 
బ్రతుకు సాధ్యపడు 
సాగుబడికి బడిరా 

తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తెచ్చిన వెలుగు రేఖవో

Share This :
avatar
Anonymous

పుచ్చకాయ లిరిక్స్. ఉమ్మెత్త కాయ మ్యూజిక్.

delete 26 April 2019 at 10:43



sentiment_satisfied Emoticon