Year: 2014
నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ సాంగ్ లిరిక్స్
తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా
నీలి రంగు చీరలోన
సందమామ నీవే జాణ
ఎట్ట నిన్ను అందుకోనే..
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే.. హేహేహే..
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే..
మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా..
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా..
జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా
రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో..
ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్..
జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా
సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా..
బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా
నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon