Year: 2001
గోగులు పూచె గోగులు కాచె (అందానికె అద్దానివె) సాంగ్ లిరిక్స్
గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
పొద్దు పొడిచె పొద్దు పొడిచె ఓ లచ్చ గుమ్మాడి
పుత్తడి వెలుగులు హ్మ్మ్ ఓ లచ్చ
అందానికె అద్దానివె కట్టున్న బొట్టున్న గోదారివె
అమ్మాయికె అర్ధానివె మాటున్న మనసున్న ముత్యానివె
ముద్దొచ్చిన గోరింటవె కట్టున్న బొట్టున్న గోదారివె
అచ్చొచ్చిన జాబిల్లివె మాటున్న మనసున్న ముత్యానివె
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉంది
ముద్దొచ్చిన గోరింటవె కట్టున్న బొట్టున్న గోదారివె
అచ్చొచ్చిన జాబిల్లివె మాటున్న మనసున్న ముత్యానివె
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకె వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకె ఆ పూల గంధాల గాలున్నది
మిల మిల మిల మిల ముక్కెర నేనై వస్త
నీ కల కల కల కల మోముని చూస్తు ఉంట
గల గల గల గల మువ్వని నేనై వస్త
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంట
కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకె నా గుండె చాటుల్లొ చోటున్నది
నీ వాడిగా ఉండేందుకె ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉంది
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉంది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon