ఓ నేస్తమా నా స్నేహ బంధమా



ఓ నేస్తమా నా స్నేహ బంధమా 

ఈ జన్మకి ఎలా సాగిపోదమా

 అదే అదే నా మనసు నీకే తెలుపుకుంటూది

 మరు జన్మ లో ఆ మనసే కలవాలనుకుంటుంది ...

నేస్తం... నేస్తం... నేస్తం... ఓ నేస్తం నా ప్రియమైన నేస్తం 

దరిచేరే మనసున్న దూరంగానే ఉంది 

ఓ నేస్తమా నా స్నేహ బంధమా 

ఈ జన్మకి ఎలా సాగిపోదమా....


నమ్మకమే లేదా నే నిజమే చెబుతున్న 

ఈ బ్రతుకే ఇంకొకరితో ముడిపడిపోయిందని 

కలనైన నిజమైన ఈ జన్మలో కలవము 

మరు జన్మంటూ ఉంటే నా మనసే నీ కంకితం 

నా మాటే వినుమా నా నేస్తమా నీ జీవితం బలిచెసుకొకుమా

 నీ పాటకు ప్రాణం నేనై నీ రేపటి స్వప్నం నేనై 

నీ ఆశల రాణిని నేనై నీ ప్రేమకు తోడుగా ఉంటా నేస్తం 

నేస్తం.. నేస్తం ..నేస్తం.. ఓ నేస్తం నా ప్రియమైన నేస్తం 

దరిచేరే మనసున్న దూరంగానే ఉంది

 ఓ నేస్తమా నా స్నేహ బంధమా

 ఈ జన్మకి ఎలా సాగిపోదమా 


 ప్రేమే నీ జీవితమని సాగించకు నీ బతుకు 

రేపటి లక్ష్యం కోసం నీ పయనం సాగించు 

కనులలోన కన్నీటిని పన్నిటిగా మార్చుకొని

 మనసున్న మహారాజుల కలకాలం ఉండమని 

తప్పనుకున్న.... ఒప్పనుకున్న ...తప్పదు విరహం... తెలుసా నేస్తం ...

 నీ పాటకు ప్రాణం నేనై నీ రేపటి స్వప్నం నేనై 

నీ ఆశల రాణిని నేనై నీ ప్రేమకు తోడుగా ఉంటా నేస్తం 

నేస్తం.. నేస్తం ..నేస్తం.. ఓ నేస్తం నా ప్రియమైన నేస్తం 

దరిచేరే మనసున్న దూరంగానే ఉంది....

Share This :



sentiment_satisfied Emoticon