ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు

 ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు

నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ వుంటాడు


ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు

నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ వుంటాడు


చిరు నమ్మకమిస్తే చాలు .. నీ నమ్మినబంటవుతాడు

తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు

నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు


ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …

నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

ఆంజనేయుడు నీవాడు .. నీతోనే వున్నాడు …

నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు


ఎందుకా కంగారు .. వద్దులే బంగారు ..

నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు

మనసులో కన్నీరు .. తలచినా తనవాడు ..

కరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు

సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు ..

గుండె గుడిలో నిన్ను కాచే కండగల మొనగాడు

మాటిస్తే తప్పని వాడు .. నిన్ను మనవాడనుకున్నాడు

నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగేసాడు


ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …

నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు


సైన్యమూ అతడేరా .. ధైర్యమూ అతడేరా ..

స్వామీ కార్యం మరిచిపోనీ ధర్మమూ తనదేరా


నీ కన్నులు వెలిగే దాకా తన కంటికి లేదే నిదుర ..

జై హనుమా అనుకో నీ చిరునవ్వుకు హమీ తన ప్రేమ


ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …

నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

ఆంజనేయుడు నీవాడు .. నీతోనే వున్నాడు …

నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

Share This :



sentiment_satisfied Emoticon