చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే సాంగ్ లిరిక్స్

Album : Yagnam

Sirivennela Seetharama Sastry

Singers:  Shreya


చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే

ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ

చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి

వెన్నెలల్లే కన్నుల్లో కొలువుందే ఓ


రమ్మని తన అల్లరి

ఝుమ్మని నా ఊపిరి ఓ ఓ


చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే

ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ


సూర్యుడైన చల్లారడా

వాడిలో వేడికి దాడిలో వాడికి ఎప్పుడు ఆ ధాటి కనలేదనీ

చంద్రుడైనా తల దించాడా

చెలియా చిరునవ్వుకు చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేననీ


చిగురాకులై గుండెలు ఊగవా చెలరేగి వేగానికి

సిరిమువ్వలై గుండెలు మ్రోగవా వయ్యారి సై ఆటకీ


మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్ధమే తానుగా

రమ్మని ఆ అల్లరి కమ్మగా మది తాకేనే ఓ ఓ


తరలి రావా ఆ తారలు

రేయి నడిజాములో వాలు జడ సీమలో

జాజులై తల దాచుకుంటామనీ

మురిసి పోవ రహదారులు

వాయు వేగాలతో వేయి సరదాలతో

తానిలా వస్తున్న కబురే వినీ


మా రాణి పారాణి పాదాలతో ఈ నెల పులకించగా

మారాలా గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా


కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకేనే చూపగా

ఝుమ్మని నా ఊపిరి ఆమెకే ఎదురేదని ఓ ఓ


చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే

ఇన్ని నాళ్ళు నా నీడై ఎదిగాడే ఓ

చిన్ననాటి సిరిమల్లె ఈనాటి కన్నె జాబిల్లి

వెన్నెలల్లే కన్నుల్లో కొలువుందే ఓ


రమ్మని తన అల్లరి

ఝుమ్మని నా ఊపిరి ఓ ఓ

Share This :



sentiment_satisfied Emoticon