కథలో రాజకుమారి సాంగ్ లిరిక్స్ కళ్యాణ రాముడు (2003) తెలుగు సినిమా

 


Album : Kalyana Ramudu


Starring: Venu, Nikhitha, Prabhu Deva

Music: Mani Sharma

Lyrics-Sri Harsha

Singers : K J Yesudas

Producer: Venkata Shyam

Director: Ram Prasad

Year: 2003English Script Lyricsకథలో రాజకుమారి సాంగ్ లిరిక్స్ 

కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా

ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా

హృదయములోని మనసును రేపి

బ్రతుకులలోని తీపిని చూపి

కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు


కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా

ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ


ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా

ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి ఆశీస్సు అందేనురా

ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా

చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ, ఆ ప్రేమ పండేనురా

కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు

చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు

శుభకరములు తన కరములు వరమాలే ఇచ్చేరా


కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా

ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ


శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా

తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా

బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా

కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా

తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ

నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ

వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా


కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా

ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా

హృదయములోని మనసును రేపి

బ్రతుకులలోని తీపిని చూపి

కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు


కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా

ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ


Share This :sentiment_satisfied Emoticon