ఈశ్వరా పరమేశ్వరా సాంగ్ లిరిక్స్ ఉప్పెన (2020) | Aarde Lyrics

 Album : Uppena


Lyrics-Chnadrabose
Producer: Naveen Yerneni, Y Ravi Shankar
Director: Buchi Babu Sana
Year: 2020


EnglishScript Lyrics CLick Here


ఈశ్వరా పరమేశ్వరా సాంగ్ లిరిక్స్ 


ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా
ఆఆఆ ఆ ఇటు చూడరా

దారి ఏదో, తీరమేదో గమనమేదో, గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా
చీకటేదో, వెలుతురేదో మంచు ఏదో, మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని లోని కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఆఆఆ ఆ ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఆఆఆ ఆ ఇటు చూడరా

నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా
ఆఆ ఇటు చూడరా
మసక బారిన కంటిపాపకి ముసుగు తీసే వెలుగు లాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా
ఆఆఆ ఆ ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా
ఆఆఆ ఆ ఇటు చూడరాShare This :sentiment_satisfied Emoticon