చిన్నారి స్నేహమా సాంగ్ లిరిక్స్ సాద్యం తెలుగు సినిమా | చిన్నారి స్నేహం (1989)

label


Album : Chinnari sneham

Starring: Chandramohan Seetha Rahman

Music : Chakravarthi

Lyrics-Veturi

Singers : S.P.Balu, P.Susheela, S.P.Shailaja, Ramesh

Producer: Ram Gopal Varma and Boney Kapoor

Director:  Muthyala Subbaiah

Year: 1989

English Script Lyrics Click Hereచిన్నారి స్నేహమా..

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో

గతమైన జీవితం కథ గానె రాసుకో

మనసైతే మళ్ళి చదువుకో...

మరు జన్మ కైన కలుసుకో

ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న..

హాయి గానే సాగిపో


చరణం  1:

జీవితం నీకోసం స్వాగతం పలికింది

ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది

ఆకాశమంతా ఆలయం నీకోసం కట్టుకుంది

కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది

స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది

కాలం కరిగిపొతుంతే కలగ చెదిరి పోతుంది

మాసిపోని గాయమల్లె గుండె లోనే ఉంటుంది

"చిన్నారి స్నేహమా"


చరణం  2:

ఆశయం కావాలి ఆశలే తీరాలి

మనిషిలొ దేవున్ని మనసుతో గెలవాలి

అందాల జీవితానికో అనుబంధం చూసుకో

అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో

లోకం చీకటవుతున్న బ్రతుకే భారమవుతున్న

మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి

మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూపాలి

చిన్నారి స్నేహమా..

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో

గతమైన జీవితం కథ గానె రాసుకో

మనసైతే మళ్ళి చదువుకో... మరు జన్మ కైన కలుసుకో

ఏ నాటి కేమవుతున్నా ఏ గూడు నీదవుతున్న.. హాయి గానే సాగిపో

Share This :sentiment_satisfied Emoticon