యోగీ యోగీ రే యోగీ సాంగ్ లిరిక్స్ | అక్కడొకడుంటాడు (2019) తెలుగు సినిమా

చిత్రం : అక్కడొకడుంటాడు (2019)
సంగీతం : చంద్రలేఖ సార్క్స్     
సాహిత్యం : దేవేంద్ర కె.
గానం : కారుణ్య     

ఏ యోగీ యోగీ రే యోగీ
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా

ఏ యోగీ యోగీ రే యోగీ

శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను

తీరాన ఓ మౌనరాగం
గుండెల్లొ గాయాల గేయం పాడగా
సాగింది ఓ రుధిర యాగం
ఎగిసింది ఓ వీర ఖడ్గం జ్వాలగా
పిలిచే కదన రంగం
చేసే సింహ నాదం
ధర్మం ధ్యేయమైతె
కాలం లొంగి రాదా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా

ఏ యోగీ యోగీ రే యోగీ

శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
Share This :



sentiment_satisfied Emoticon