చిత్రం : ప్రేమకథాచిత్రమ్ 2 (2019)
సంగీతం : జె.బి(జీవన్ బాబు)
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : సత్య యామిని
నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే
చిరునవ్వంటూ తెలిసింది నీ వలనే
నా అడుగు నడిచింది నిను చేరాలనే
ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా
తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే
ఎన్నో ఎన్నో కోపాలే
అన్నీ అన్నీ మరిచాలే
నన్నే నన్నే మార్చేటంతగా
నిన్న మొన్న అలకలు ఎన్నున్నా
చిన్ని చిన్ని చినుకులు అనుకున్నా
తుళ్ళి తుళ్ళి తడిశా వింతగా
ప్రతి సారీ వెతుకుతున్నా
ఎదురైతే నే తప్పుకున్నా
ఎదచాటుమాటు మాట ఏమిటో
ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా
తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే
అల్లేస్తున్నా గాలల్లే
చల్లేస్తున్నా పూవుల్నే
నువ్వే వెళ్ళె దారిలొ ముందుగా
నింపేస్తున్నా రంగులు ఎన్నెన్నో
పంపిస్తున్నా సందడులింకెన్నో
వెంటే ఉంటూ నీకే నీడలా
బదులేదీ తెలియకున్నా
విడలేనే ఏవేళనైనా
తొలిప్రేమ నాకు ప్రాణమవ్వగా
ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా
తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon