చిత్రం : జెర్సీ (2019)
సంగీతం : అనిరుధ్
సాహిత్యం : కృష్ణకాంత్ (కె.కె)
గానం : కాలభైరవ
అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే
తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే
అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా
గమనాలనే.. గమనించరా..ఆఅ..
గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
పిడుగు వలెనె పడుతు
కలుపు ఇక ఈ నింగీ నేలా
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా
అడుగు కదుపు జయము జగము
నీ సొంతం అయ్యేలా
విధికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతం చూపేలా
తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే
అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ
మారిపోయి ఓడెరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే
తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే అడుగులో చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే బరువిక తేలికాయెలే
అణిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon