చిత్రం : మార (2021)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం :
గానం :
ఏ పిలుపిది ఏ పిలుపిది యే స్వరమిది
చెవిన పలికి మదిని తడిపిన వరమిది
పో పొమ్మను మాటే నోట రాకున్నది
స్వరము వెంట వేలు పట్టి వెళుతున్నది
కలలారని కనుపాపల జో లాలి ఆరారో
ఊపిరి పరవశమై పోయేను ఆరిరో రారో
వాన చినుకు తాకకనె దేహం తడిచే
మది పుకారు విని షికారుకని నడిచే
చేరువరకు గమ్యమెటో తెలిపేదెలా
అంతవరకు అల పాటే ఆపేదెల
చివరి వరకు వినని కథే ముగిసేదెలా
వెతికి తెలుసుకోకుంటే రాసేదెలా
ఎద ఊయల ఒడిలో కలలే
తెలుపు మలుపు
నీ శ్రమ సాధించెను గెలుపు
ఆ గెలుపు వేల నిధులే
చిరుగాలి పలికే శుభా కాంక్షలే
ఏ పిలుపిది ఏ పిలుపిది యే స్వరమిది
చెవిన పలికి మదిని తడిపిన వరమిది
పో పొమ్మను మాటె నోట రాకున్నది
స్వరము వెంట వేలు పట్టి వెళుతున్నది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon