కలయిక ఓ మాయ పరిచయమో మాయ పాట లిరిక్స్ | A (AD INFINITUM) (2021)

 చిత్రం : A (AD INFINITUM) (2021)

సంగీతం : విజయ్ కూరాకుల  

సాహిత్యం : అనంత శ్రీరామ్  

గానం : దీపు, పావని


కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

పెరిగే స్నేహంలో పరిమళమో మాయ

పంచిన ప్రాణంలో పరితపమో మాయ


కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

పెరిగే స్నేహంలో పరిమళమో మాయ

పంచిన ప్రాణంలో పరితపమో మాయ


గడిచే కాలంలో ఓ ఓ ఓఓ ఓఓ

గడిచే కాలంలో గతమంటే ఓ మాయ

నిలిచేటి బంధంలో నిమిషానికో మాయ


కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ


ఏ మై నా ఈపైన

అడుగులు నీతోనే అలసట నీతోనే

హా యై నా బాధైనా

చెరిసగమౌతానే బ్రతుకిక నీతోనే

జతలో సాగించే ఓ ఓ ఓఓ ఓఓ

జతలో సాగించే సరదా ఓ మాయ

సరదాలో పంచే సరసం ఓ మాయ

ఒకరా ఇద్దరమా అనిపించే మాయ

ఒకరే ముగ్గురుగా కనిపించే మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ


లో లో చాలా ఉన్న

బయటికి మాటల్లో తెలియదు కొంతైనా

నా లో ఏ ప్రశ్నైనా

ఎదురుగ నీ ప్రేమ బదులుగ నిలిచేనా

అనురాగం చేసే ఓ ఓ ఓఓ ఓఓ

అనురాగం చేసే అల్లరి ఓ మాయ

మమకారం వేసే మంత్రం ఓ మాయ

కలలో వెంటాడే కలవరమో మాయ

నిజమై వెంటుండే నీ పలుకే మాయ

 

కలయిక ఓ మాయ పరిచయమో మాయ

కలిసిన చేతుల్లో పరవశమో మాయ

   

Share This :



sentiment_satisfied Emoticon