చిత్రం : కపటధారి (2021)
సంగీతం : సైమన్ కె.కింగ్
సాహిత్యం : వనమాలి
గానం : ప్రదీప్ కుమార్
కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే
కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే
నిలపద నా ఆకాశం
నీ నవ్వుల నక్షత్రం
ఎదుటే ఎపుడూ
వెనకటి నా ఆనందం
మరలద ఇక నా కోసం
జతగా ఇపుడూ
నా నిజం కలగా
ఈనాడిలా కథగా
మార్చేస్తుంటే మౌనంగానే
నమ్మే తీరాలా ఈ వేళా
కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
నడిచిన నా ప్రతి అడుగు
వెతికెనులే నీ కొరకు నిదురే మరిచి
నిను విడువక నీ ఒడిలో గడిపిన
నా ప్రతి నిమిషం రాదా తిరిగీ
ఆయువే అలసి నా ఆశలే ముగిసి
నీవేలే నీ నా లోకంలో
నేనేమౌతానో ఈ వేళా
కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon