తల్లీ ఏలేవు ఎదమీటి పాట లిరిక్స్ | పెద్దమ్మతల్లి (2001)

 చిత్రం : పెద్దమ్మతల్లి (2001)

సంగీతం : దేవా

సాహిత్యం :

గానం : బాలు


తల్లీ ఏలేవు ఎదమీటి

కాసేవు కర్పూర నీరాజనాలందీ

అమ్మా పెద్దమ్మ అవధరించు

దశదిశలు ధగధగలు వెదజల్లే నీ కథను

ఓ తల్లి మా తల్లి అందరిని అలరించి

ఆదరించు అమ్మోరు తల్లివమ్మా తల్లివమ్మా


అందచందాల తల్లిరా

ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా

భక్తి కి ముక్తిచ్చే తల్లిరా

పెద్దమ్మ తల్లి తల్లులకే కన్న తల్లిరా

పూర్వుల పూజలే పుణ్యాల రాశులై

దేవి కరుణ కురిసి వరదయ్యింది

ఒడిసి పట్టుకుని ఒడిలో చేర్చుకుని

ఓదార్చి సేద దీర్చి లాలిస్తుంది

అందచందాల తల్లిరా

ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా


ఒకానొక కాలంలో

ఒక భక్తుని తపసు మెచ్చి

దరిశనమే ఇచ్చిందా దయారూపిణి

పతితుల పాపాలు పరిహారమును జేయ

ఇలను వెలసి కొలువుదీర వేడెను స్వామి

ఆ మొరలను విని భక్తుల గని

అన్నదిటుల శ్రీమాతా ఈ మాటే వేదంగా వస్తానని

షరతొకటి ఉన్నదని వెనుదిరిగి చూడొద్దని

చిరునవ్వులు చిందుస్తూ చిన్మయి

ఒప్పినాడు భక్తుడు మున్ముందుకు సాగుతూ

అందెల సడి ఆగిపోయి అనుమానం వచ్చింది

వెనుదిరిగి చూసినాడు విగ్రహమయ్యింది తల్లి


ఏమిటిది తల్లీ అని ఎందుకిలా అయ్యిందని

భంగపడిన భక్త వరుడు బాధగ అడిగాడు

కారణం ఉన్నదయా ఇదేనయా నా దయా

తప్పునీది కాదయ్యా బాధపడకయ్యా

ఈ సరిహద్దుల హద్దులేని అసురగణం

చెలరేగే కాలమొకటి వస్తుంది కాచుకొను

నాకిచటే గుడి కట్టి అర్చనలే అర్పిస్తే

అందరిని ఆదరించి రక్షిస్తాను

ఆలయం వెలసింది ఆశయం తీరింద్

ఆక్షణం నుండి భక్తులకు వరముల నిధి దొరికింది

పెద్దమ్మ మహిమ ఊరు వాడంతా విరిసింది


అందచందాల తల్లిరా

ఈ తల్లి కన్న మంచి తల్లి లేదురా

పూర్వుల పూజలే పుణ్యాల రాశులై

దేవి కరుణ కురిసి వరదయ్యింది 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)