Album : Kalavaramaye Madilo
Starring: Kamal Kamaraju, Vikram Gokhale, Swati Reddy
Music : Sharath Vasudevan
Lyrics-Vanamali
Singers : Chitra
Producer: Mohan Vadlapatla
Director: Satish Kasetty
Year: 2009
English SCRIPT LYRICs CLICK HERE
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం సాంగ్ లిరిక్స్
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం
ఒక తండ్రి కలలకే సాకారముగా
జన్మను పంచిన జననీ జనకుల
ఆలనలే ఆలాపనగా
అనురాగములే ఆలంబనగా
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
నిప్పులలో నడిచింది నిన్నటి ఆ సీత కథ
ఆరని మంటయ్యింది ఒంటరి నా అమ్మ కథ
కడుపు తీపినే పెంచాయేమో తను మోసిన నవ మాసాలు
కడకు భర్తనే కాదని తానే గడిపిందా వనవాసాలు
శిలనైనా కరిగించే సామవేద సంగీతం
పచ్చని ఆ దాంపత్యానికి పాడిందొక చరమ గీతం
ఏనాటికి ముడి పడుతుందో ఏడడుగుల ఈ సంబంధం
విడదీసిన ఏడు స్వరాలే కలిపేనా ఆ అనుబంధం
గగస రిరిగ ససప దదప
రిగపగస గపదసరి పదసరి
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
మురిపాలను తాగినదమ్మా నీ ఒడిలో ఈ పసి ప్రాణం
సరిగమలను నేర్పినదమ్మా నాన్నలోని అమృత గానం
తప్పటడుగులేసిన నిమిషం తల్లి చాటు తనయే అయినా
తాళగతిని వీడని లక్ష్యం తండ్రి వెంట నడిపించింది
గురువే...
గురువే నా తండ్రిగా మారి కన్న గురుతు చూపిస్తుంటే
జాలిలేని ఆ విధిరాతే తననే బలి పెడుతూ ఉంది
ఆ మృత్యువు రాతి గుండెని నా గానం కరిగిస్తుందా
చెదిరిన మమ గూటికి చేర్చి
తన ప్రాణం నిలబెడుతుందా
రీరీరి సరీరి సరిగగ రిరిసద
సదాప గపదప గరి
రీగ గాగ రిగాగ రిగప గాగ రిగ పగారి సదా
దసదప
పదద ససరి
దద సస రిరి గగ ప
సస రిరి గగ పప ద
రిరి గగ పప దద స
గగ పప దద సస రి
రిరిగ రిగ రిరిగ రిగ రిరిగ రిగ పగ
గగరి గగరి గగరి గరి సద
రిరిస రిరిస రిరిస రిస దప
దదప దదప దదప దప గరి
గగరి గగరి గగరి గరి సద
ససస రిరిరి గగగ పపప దదద ససస రిరిరి
రిరిరి గగగ పపప దదద ససస రిరిరి గగగ
గగగ పపప దదద ససస రిరిరి గగగ పపప
పద పద పద పగరిగ
పద పద పద పగరిగ
పప దప దప దప దప దప దప దప సా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon