చిత్రం : తూర్పు సింధూరం (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
నడివీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
అరె గలగల మోగిన పాదం
ఆ ముచ్చట మువ్వల నాదం
అది పెరుగును ఏనాడో
గోపాలుని ఆటల మైకం
రేపల్లెగ మారును లోకం
జగమంతా తూగాడూ
దేహం ఉంటే రోగం ఉందీ
సౌఖ్యమూ చింతా ఉందీ
పెదవిలోన నవ్వులు ఉంటే
దుఃఖమెలా నిలబడుతుంది
వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
తలవాకిట ముగ్గులు వేకువకే అందం హ హ
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
ప్రతి మనిషికి మనసుంటుంది
వేరొకరిది ఐపోతుంది
అందుకోసమే పెళ్ళాడు
తొలిముచ్చట ముద్దర పడితే
ఆ జంటకు నిద్దర చెడితే
ఆ కేళికి వెయ్యేళ్ళూ
రాతిరుంటె ఉదయం ఉందీ
కలత ఉంటే కులుకు ఉందీ
ఊసులాడు పండగ వేళ
ఆశలకే బలమిస్తుంది
వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం హహ
నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం హహ
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon