సరసాలు చాలు శ్రీవారు వేళకాదు పాట లిరిక్స్ | శివ (1989)

 చిత్రం : శివ (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సిరివెన్నెల

గానం : మనో, జానకి


సరసాలు చాలు శ్రీవారు వేళకాదు

విరహాల గోల ఇంకానా వీలుకాదు

వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు

చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు

విరజాజి పూలు వంటింట్లో వాడరాదు


సూర్యుడే చురచుర చూసినా

చీరనే వదలరు చీకటే చెదిరినా

కాకులే కేకలు వేసినా

కౌగిలే వదలను వాకిలే పిలిచినా

స్నానానికీ సాయమే రావాలనే తగువా

నీ చూపులే సోపుగా కావాలనే సరదా

పాపిడి తీసి పౌడరు పూసి

బయటికే పంపేయనా

పైటతో బాటే లోనికి రానా పాపలా పారాడనా

తీయగ తిడుతూనే లాలించనా

సరసాలు చాలు శ్రీవారు తానననానా

విరహాల గోల ఇంకానా ఊహుహుహు..

 

 కొత్తగా ముదిరిన వేడుక

మత్తుగా పెదవుల నీడకే చేరదా

ఎందుకో తికమక తొందరా

బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా

ఆరారగా చేరకా తీరేదెలా గొడవ

ఆరాటమే ఆరగా సాయంత్రమే పడదా

మోహమే తీరే మూర్తమే రాదా

మోజులే చెల్లించవా

జాబిలే రాడా జాజులే తేడా రాతిరి రాగానికా

ఆగదే అందాకా ఈడు గోల


చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు

విరజాజి పూలు వంటింట్లో వాడరాదు 

ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు 

Share This :



sentiment_satisfied Emoticon