ఆడే పాడే పిల్లలం పాట లిరిక్స్ | ప్రేమించు పెళ్ళాడు (1985)

 చిత్రం : ప్రేమించు పెళ్ళాడు (1985)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, శైలజ


ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం

ఎండావాన పాపలం.. నెమలి కన్నులం

పాడే పాటే పూవై.. పూసేనమ్మా విరితోటా

ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం

ఎండావాన పాపలం.. నెమలి కన్నులం


చిగురులలోనా...ఆఆఆఆఆ....

చిగురులలోనా చేదులు మింగీ

తేనెలు చల్లే కోయిలా

బిరబిరలాడే ఎండను తాకీ

జున్నును పంచే మావిలా

కాలం లోకం కరిగే వేళా

ప్రాణం ఒకటై పలికే వేళా  

మధువై మనలో కరిగే వలపే

పెదవి చివర ఎదలు నిలుపు వేళా

ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం

ఎండావాన పాపలం.. నెమలీ కన్నులం


పదములు సోకీ..ఈఈఈ. హాఅ...

పదములు సోకీ పదములు పాడే

ఎండిన ఆకుల పాటలా పచ్చని ఆకుల పారాణులతో

పండిన మావిడి తోటలా

స్వప్నం కానీ స్వర్గం దొరికే

శిల్పం కానీ అందం కదిలే

లయలూ హొయలూ ప్రియమై కలిసే

వయసు మనసునడుగుతున్న వేళా


ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం

ఎండావాన పాపలం.. నెమలి కన్నులం

పాడే పాటే పూవై.. పూసేనమ్మా విరితోటా


ఆడే పాడే పిల్లలం.. మురళీ నవ్వులం

ఎండావాన పాపలం.. నెమలి కన్నులం 

Share This :



sentiment_satisfied Emoticon