నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా పాట లిరిక్స్ | అయ్యప్పస్వామి జన్మ రహస్యం (1987)

 చిత్రం : అయ్యప్పస్వామి జన్మ రహస్యం (1987)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : పి.బి.శ్రీనివాస్

గానం : ఏసుదాస్


స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా


అంధకారమందే అలమటించి నేనూ

కన్నులుండి కూడా కాననైతి నిన్నూ

అంధకారమందే అలమటించి నేనూ

కన్నులుండి కూడా కాననైతి నిన్నూ

దేవ దేవ నాపై కరుణ కురియవేల

దేవ దేవ నాపై కరుణ కురియవేల

వెలుగు వైపు నాకూ వేగమె చూపించుము త్రోవ

వెలుగు వైపు నాకూ వేగమె చూపించుము త్రోవ


స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా


సిరులనెన్నడైనా అడుగుటెరుగనయ్య

స్వర్గ సుఖము కోరీ వరము వేడనయ్య

సిరులనెన్నడైనా అడుగుటెరుగనయ్య

స్వర్గ సుఖము కోరీ వరము వేడనయ్య

ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా

ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా

శాంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య

శాంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య


స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా


కనులలోన నీవే వెలుగు నింపుమయ్య

మనసులోన నీవె కొలువు తీరుమయ్య

కనులలోన నీవే వెలుగు నింపుమయ్య

మనసులోన నీవె కొలువు తీరుమయ్య

మధుర సుస్వరాల సుధలు కురియుమయ్య

మధుర సుస్వరాల సుధలు కురియుమయ్య

జీవులెల్ల నిన్ను కొరే శాంతినొసగుమయ్య

జీవులెల్ల నిన్ను కొరే శాంతినొసగుమయ్య


స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా


స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా


Share This :



sentiment_satisfied Emoticon