సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ పాట లిరిక్స్ | ఫ్యామిలీసర్కస్ (2001)

 చిత్రం : ఫ్యామిలీసర్కస్ (2001)

సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 

సాహిత్యం : కులశేఖర్ 

గానం : కోరస్   


సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్

పిల్ల కోతులే వీళ్ళు పిల్లకోతులే 

తోక తక్కువైన డౌటు లేదులే 

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 

అల్లరాపరే ఎంత చెప్పినా సరే 

బ్రహ్మ దేవుడైన ఆపలేడులే 

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 


ఇంటికొక్కడున్నచో 

ఇలాంటి పిల్లగాడు

ఊరువాడ సందడేరా 

చిన్న చూపు వద్దురా 

ఇలాంటి పోరగాళ్ళు 

పక్కలోన బాంబులేరా 

చలాకి ఈడూ జోరు చూడూ

ఆరుబైట ఆపలేని 

మాయదారి కాకి గోల 


సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్

సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్


నేటి భర్తలు వట్టి దిష్టిబొమ్మలూ 

వినక తప్పదయ్య భార్య మాటలూ

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 

నీళ్ళ పోతలూ పెట్టు తిరగమోతలూ 

మనవి కావులేరా అన్ని రోజులు

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 


మీసమెంత తిప్పినా 

మగాళ్ళ రోషమంత

చిచ్చుబుడ్డి టైపు లేరా 

దేశమంత మెచ్చినా 

మహానుభావులంత 

ఆలిముందు పిల్లులేరా

ఆడవారు ఊరుకోరు 

అప్పడాల కర్రతోటి 

భర్త మీదకురుకుతారు 

 

సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్

సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్


కొత్త కాపురం ఎంత కొంటె కాపురం 

ప్రతి ఇంటిలోన వింత భారతం

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 

ప్రేమ నాటకం బంధమొట్టి బూటకం

బొమ్మ బొరుసు కాద మనిషి జీవితం

ఫ్యామిలీ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 


అల్లరంటు చెయ్యనీ 

బడాయి పిల్లలంత 

అల్మరాలో బొమ్మలేరా

నవ్వులంటు నవ్వనీ 

పరాన్న జీవులంత 

తుమ్మచెట్టు దిమ్మలేరా

ఇలాంటి వారు లేకపోరూ

ఖర్మ కాలి కంటిముందె 

దెయ్యమల్లె తిరుగుతారు 


సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్

సర్కస్ సర్కస్ ఇది ఫ్యామిలీ సర్కస్ 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)