సంపేత్తాను నిన్ను పాట లిరిక్స్ | స్నేహంకోసం (1999)

 చిత్రం : స్నేహంకోసం (1999)

సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్

సాహిత్యం : ఏ.ఎమ్.రత్నం,

గానం : మనో, జయచంద్రన్  


సంపేత్తాను నిన్ను 

ఎదురు తిరిగి మాటాడావంటె 

ఏరా ఆడు చేసింది తప్పే కదూ 

అవును అవును పెద్దయ్యా 


హా అవును కొబ్బరి చెట్టుకు

 చేసిన ముచ్చటా 

మన అమ్మాయికి చేస్తే 

తప్పేంటి చెప్పండిరా 

అవును అవును చిన్నయ్యా 


రేయ్ ఆగరా...ఆగనండి 

ఆగమంటుంటె...ఆగనండీ 

ఒరేయ్ ఒరే ఒరేయ్... అయ్యా 

ఉత్తినే నాటకమాడాను 


ఒరేయ్ తెలివితక్కువ దద్దమ్మ 

ప్రేమ మటుకు ఉంటె చాలదు 

కూసంత రోషం కూడ ఉండాలి 

ఏమైన నువ్వు ఆ ఇంటికి 

వెళ్ళడం తప్పు తప్పే 

అవును అవును పెద్దయ్యా 


ఊర్లో అందరికి అన్ని చేస్తారు 

అసలు మన ఇంటి ఆడ పడుచు 

కంట తడి పెట్టుకుంటె మంచిదేంటి 

ప్రేమకన్నా రోషం గొప్పదా...చెప్పండ్రా 

అవును అవును చిన్నయ్యా 


అయ్యగారు...అవునండీ 

భలె మంచివారు...అవునండీ 

మరి కోపమొస్తే...అవునండీ 

భలె రోషగాడు...అవునండీ 

మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు 

మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు 


అయ్యగారి మాటంటె తలకట్టు మాట 

కాదంటె ఆ పూట తందనాల పాట 

చిన్నయ్య మాటంటె చిక్కులేని మాటా 

వినకుంటె ఆ పూట తైతక్కలాటా 

రోషమున్నా వంశమురా నువ్వు కాకా పట్టకురా 

రోషమున్నా వంశమురా నువ్వు కాకా పట్టకురా 


మాట వినక పోతె చంపేస్తా 

నా తుపాకితో నిను కాల్చేస్తా 

అవునండీ అది చెయ్యండీ 

కాల్చడం వల్ల కాదండీ 

తుపాకిలో గుళ్ళు లేవండీ 

అవునండీ అది నిజమండీ 

నూరు ఆరయిన రేయి పగలైన 

నేను మారేది లేదూ 

రోషమే లేని పౌరుషం లేని 

మీసమే ఎందుకంటా 


అయ్యయ్యో పెద్దయ్యా 

ఈ పంతాలేలయ్యా 

కోపాలే ఇంటికి ఒంటికి 

మంచిది కాదయ్యా 


అయ్యగారు...అవునండీ 

భలె మంచివారు...అవునండీ 

మరి కోపమొస్తే...అవునండీ 

భలె రోషగాడు...అవునండీ 


ఏవండొయ్ కొంచం ఆగండీ 

తువ్వాలు నడుమున కట్టండీ 

అవుండీ అది చెయ్యండీ 

వాడి మాటలు మీకేలండీ 

తేడాలిక్కడ లేనె లేవండీ 

అవునండీ అది నిజమండీ 

పెద్దవారినే గౌరవించడం 

మీరు నేర్పినది కాదా 

చిన్న వాడినే మంచి మనసుతో 

మీరు మన్నించ లేరా 

దారి కొచ్చాడు...


ఓరయ్యో చిన్నయ్యా 

మనసెరిగిన వాడివయా 

మీసాన్నే మెలివేసి 

మన కీర్తిని పెంచవయా 


అయ్యగారు...అవునండీ 

భలె మంచివారు...అవునండీ 

మరి కోపమొస్తే...అవునండీ 

భలె రోషగాడు...అవునండీ 

మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ 

మాయదారి రక్తపోటు అది పోనే పోయిందీ 


ఎడ్డెమంటె తెడ్డెమంటు వెర్రెక్కి పోయే 

అయ్యగారి కోపమంత కొండెక్కి పోయే 

వానొచ్చి వరదొచ్చి చల్లారి పోయే 

చిన్నయ్య మనసంత సంతోషమాయే 

రోషమున్నా వంశమురా 

రారాజుగ బతికెయ్ రా 

రోషమున్నా వంశమురా 

రారాజుగ బతికెయ్ రా 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)