కనులు కలిశాయి కథలు తెలిశాయి పాట లిరిక్స్ | చిరునవ్వుతో (2000)

 చిత్రం : చిరునవ్వుతో (2000)

సంగీతం : మణిశర్మ     

సాహిత్యం : భువనచంద్ర   

గానం : హరిహరన్, చిత్ర  


కనులు కలిశాయి కథలు తెలిశాయి 

కలలు నిజమాయే ఓ.. 

క్షణమె యుగమాయె సొగసె బరువాయె 

నిదుర కరువాయే ఓ... 

కనులు కలిశాయే కథలు తెలిశాయే 

కలలు నిజమాయే ఓ.. 


ఎదలో ప్రేమెంతున్నా విడిపోదా మౌనమే

పెదవికి పెదవందించి తీర్చెయ్ వా దాహమే

తనువులు కలిసే దాకా తెలియదులే తాపమే

విరహం లోనే ఉందోయ్ వింతైన సౌఖ్యమే

సయ్యంటే పెదవి కలుపుతా 

ప్రతి పూటా ప్రేమ తెలుపుతా 

చనువిస్తే చిలిపి మన్మథా 

పరువానికి రాద ఆపదా 


వలపుల పిలుపులు తెలిసీ దరిచేరా ప్రాణమా 

అందని అందాలిస్తా అలరించేయ్ నేస్తమా 

పిలువక పిలిచిన పిలుపే ప్రియమౌనే ప్రేయసి 

కిలకిల నవ్వులలోనే కథ తెలిసెను ఊర్వశి 

పిలుపొస్తే పురుష పుంగవా 

కొసమెరుపై కౌగిలించవా

దరి చేరిన దివ్య సుందరి 

ఇక చేసేయ్ ప్రేమ లాహిరీ


కనులు కలిశాయే కథలు తెలిశాయే 

కలలు నిజమాయే ఓ.. 

క్షణమె యుగమాయె సొగసె బరువాయె 

నిదుర కరువాయే ఓ... 

 


Share This :



sentiment_satisfied Emoticon