ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు పాట లిరిక్స్ | కన్నవారి కలలు (1974)


చిత్రం : కన్నవారి కలలు (1974)

సంగీతం : వి.కుమార్

సాహిత్యం : సినారె

గానం : రామకృష్ణ, సుశీల


ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు

తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు


ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు


ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో

ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడుకున్నాయో

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో

ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడుకున్నాయో


ఆ.. పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ

ఆ.. గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ

కలిసిన కౌగిలిలో కాలమే ఆగినదీ


ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు


చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా

మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా

ఆహా చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా

మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా


ఆ.. కొంటెగా నిన్నేదో కోరాలనివుంది

ఆ.. తనువే నీదైతే దాచేదేముంది

వలపుల వీణియపై బ్రతుకే మ్రోగిందీ


ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు 

 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)