చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..
నీ గీతి నేనై నా అనుభూతి నీవైతే చాలు
పదివేలు కోరుకోనింక ఏ నందనాలు
ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు
అంతే చాలు ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ హహాహా హో హో హో హో
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..
ఆ కొండపైనే ఆగే మబ్బు తానే
ఏమంది.. ఏమంటుంది?
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే
ఏమంది.. ఏమంటుంది?
పదికాలాలు ఉంటానంటుంది
హా ఆ ఆ ఆ ఆ హహాహా హ హ హ
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon