నిన్న చూసి వెన్నెలే అనుకున్నా పాట లిరిక్స్ | హ్యాపీడేస్ (2007)

 చిత్రం : హ్యాపీడేస్ (2007)

సంగీతం : మిక్కీ జె. మేయర్ 

సాహిత్యం : వనమాలి 

గానం : కార్తీక్  


నిన్న చూసి వెన్నెలే అనుకున్నా

మొన్న కూడా నిన్నలా కలదన్నా

అడుగెటు పడుతున్నా 

తనవైపెళుతున్నా


కునుకైన రాని సమరాన

కను మూస్తే చాలు తమరేనా

పెనవేసుకున్న ప్రణయమున

యమునా తీరేనా


నింగి లోని తారలా నీవున్నా

నేలకందే దారులే చూస్తున్నా

ఎదురుగ నేనున్నా

ఎరగవు కాస్తైనా


ఒక మనసు తపన చూసైనా 

ఒడి చేరవేల ఓ లలన

అలజడులు బయట 

పడుతున్నా మౌనంగా ఉన్నా


కరిగా ఓ తీపి కలగా

మిగిలా ఈ నాడు శిలగా

ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా


కరిగా ఓ తీపి కలగా

మిగిలా ఈ నాడు శిలగా

ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా 

 

Share This :



sentiment_satisfied Emoticon