ఇలా ఇలా తేలాను పాట లిరిక్స్ | తలైవి (2021)

 చిత్రం : తలైవి (2021)

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్  

సాహిత్యం : సిరాశ్రీ

గానం : సైంధవి  


ఇలా ఇలా తేలాను 

ఈ గిల్లేటి గాలుల్లో

ఘుమా ఘుమా పూలెన్నో 

జల్లేటి దారుల్లో


ఇలా ఇలా తేలాను 

ఈ గిల్లేటి గాలుల్లో

ఘుమా ఘుమా పూలెన్నో 

జల్లేటి దారుల్లో

నా మదే హాయిగా ఎందుకో

ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల


ఇలా ఇలా తేలాను 

ఈ గిల్లేటి గాలుల్లో

ఘుమా ఘుమా పూలెన్నో 

జల్లేటి దారుల్లో


మేఘాలన్నీ చన్నీరంతా

నా మీద పన్నీరు జల్లేట్టుంది

పల్లకిలో ముస్తాబయ్యి 

జాబిల్లి ఊరేగినట్టే ఉంది

కన్నుల్లో ఉన్న కనుపాప కూడా

కలలేవో కంటూ ఉంది

నేలమ్మమనసే ఆ నింగికిచ్చి

ఓ ముద్దు కోరుతుంది


నా మదే హాయిగా ఎందుకో

ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

Share This :



sentiment_satisfied Emoticon