కోకిలమ్మ కొత్తపాట పాడింది పాట లిరిక్స్ | సుందరకాండ (1992)

 చిత్రం : సుందరకాండ (1992)

సంగీతం : కీరవాణి 

సాహిత్యం : వేటూరి  

గానం : బాలు, చిత్ర


కోకిలమ్మ కొత్తపాట పాడింది

కూనలమ్మ కూచిపూడి ఆడింది

సందెపొద్దు నీడ అందగత్తె కాడ

సన్నజాజి ఈల వేయగా


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా


పక్కపాపిడెందుకో

పైట దోపిడెందుకే

మగడా ఎడాపెడా 

గడీ పడగానే 


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా


పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో 

నీ గుట్టు తీపిగున్నది

పైటగుట్టు బైటపెట్టు చేతిపట్టులో 

నీ కట్టు జారుతున్నది

కొత్తగుట్టు కొల్లగుట్టు కోకోనట్టులో

రాబట్టు కొబ్బరున్నది

దాచిపెట్టి దోచిపెట్టు చాకులెట్టులో

బొబ్బట్టు మోతగుందది

బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే 

విచ్చుకుంటావయ్యో

నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే

పుచ్చుకుంటానమ్మో

వరసే నిలు కలు కొలు అనగానే


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా


కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకపట్టులో

కాల్‌షీటు నైటుకున్నది

పాలుపట్టి పండబెట్టు పానిపట్టులో

బెడ్‌షీటు బెంగపడ్డది

బెడ్డులైటు తీసికట్టు గుడ్డునైటులో

కుర్ర ఈడు కుంపటైనది

ఉట్టికొట్టి చట్టిపట్టు జాకుపాటులో

ఆటుపోటు అక్కడున్నది

ఒంపులో సొంపులో నిన్ను 

వొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో

చెప్పినా చేసినా నీది కాని 

నాది ఎక్కడుంటాదయ్యో

ఘజలే చెలి అనార్కలి అనగానే 


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా


పక్కపాపిడెందుకో

పైట దోపిడెందుకే

మగడా ఎడాపెడా 

గడీ పడగానే 


అరె మావా ఇల్లలికి 

పండుగ చేసుకుందామా

ఓసోసి భామా బుగ్గలతో

బూరెలు వండుకుందామా

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)