చంద్ర కాంతిలో చందన శిల్పం లిరిక్స్ | శ్రీవారి శోభనం

చిత్రం : శ్రీవారి శోభనం
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు




చంద్ర కాంతిలో చందన శిల్పం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతి లయలా మణిహారం..
గేయమంటి నీ సోయగమంతా కవినై పాడుదునా..
చూపుల చలితో ఊహల ఉలితో చెలి నిను తాకుదునా..
చెలి నిను తాకుదునా..

చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..

తరగలా నవ్వులా నురగలా మువ్వలా
పరుగుల పల్లవితో ఉరవడి ఊహలతో
రాలకు సైతం రాగం నేర్పే రాయల నాటి తుంగభద్రవో
శ్రీనాధుడికే శృంగారాలను నేర్పిన వాణివి కృష్ణవేణివో
ప్రణయ కవన సుందరీ.. దేశి కవితలో తేనెగ పొంగుదునా
నీ పద లయలో నీ అందియనై పదములు కడుగుదునా..
పదములు కడుగుదునా...

చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..

వెన్నెలా కుంచెలా.. చీకటీ రేఖాలా
పండిన కుంకుమతో పచ్చని శోభలతో
రాముని పదముల నాదమై ఎగసీ నదిగా మారిన గౌతమివో
తెలుగు పాటకీ తెలుగు మాటకీ వెలుగు చూపినా వంశధారవో
వెలుగు నీడలే ఏడు రంగులై వేణువులూదుదునా..
పుత్తడి బొమ్మకు పున్నమి రెమ్మకు కౌగిలి పట్టుదునా..
కౌగిలి పట్టుదునా..

చంద్ర కాంతిలో చందన శిల్పం..
స్వర శ్రుతిలయలా మణిహారం..
చంద్ర కాంతిలో చందన శిల్పం..
Share This :



sentiment_satisfied Emoticon