చిత్రం : లలిత గీతం
సంగీతం :
సాహిత్యం : వింజమూరి శివరామారావు
గానం : రావు బాల సరస్వతి
నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ.. నా యుల్లము రంజిల్లగా
నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా
నల్లని వాడా..ఆఆఆ...
నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే
నా మనసూ తనువూ.. నా మనికే నీది కదా
పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..ఆఆఆ...
ఆకశానా మబ్బులనీ చీకటులే మూగెననీ
నేనెరుoగ నైతిని నీ తలపే వెలుంగాయె
పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..ఆఆఆ...
మెరుపే నీ దూతికయై వలపే నా నెచ్చెలి యై
తోడితెచ్చె నీ దరికీనాడు పండే నా నోములూ
పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా
నల్లని వాడా..ఆఆఆ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon