చిత్రం : ధర్మచక్రం (1996)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
సాహిత్యం : వేటూరి,
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ
గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ
ఆకాశమే నా హద్దుగా
నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసులు
ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ
గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ
వేసంగి మల్లెల్లో సీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ
ధీరసమీరే యమునా తీరే
వలచితి నే వనమాలీ
గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళీ
లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవే లేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రామా
వయసు తెలిసె ఒడిలో
ఎద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో
ఇంకెపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన
వయ్యారాలే తాకే వేళ
ధీరసమీరే యమునా తీరే
వలచితి నే వనమాలీ
ఆఆఅ గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళీ
ఆకాశమే నా హద్దుగా
నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసులు
ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ
గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon