చిత్రం : ఆనంద్ (2004)
సంగీతం : కె.ఎం.రాథాకృష్ణ
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, చిత్ర
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో
గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమా
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మధుర కథా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మధుర కథా
యమునా తీరం సంధ్యా రాగం
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగా విధినైనా చేసేదే ప్రేమా
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మనసు కథా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మనసు కథా
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో
గోదారి మెరుపులతో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon