కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై పాట లిరిక్స్ | పోలీస్ (2016)

 చిత్రం : పోలీస్ (2016)

సంగీతం : జి.వి.ప్రకాష్       

సాహిత్యం : అనంత్ శ్రీరాం 

గానం : హరిహరన్, సైంధవి, వైకోం విజయలక్ష్మి 


కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై

గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది

నీ పేరు ప్రాణనాడి అయినదే.. ఓఓ

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై

గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై


ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత 

మంజులతర శృంగారే సంచారే

అధర రుచిత మధురితభగ సుధనకనక 

ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే

మమతమసకు సమదససత 

ముదమనసుత సుమనలయివ

సుసుతసహితగామం విరహరహిత భావం

ఆనందభోగం ఆ జీవకాలం

పాశానుబంధం తాళానుకాలం

దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే


హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే

ఉదయాన్ని దాచే కురులింక నావే

ఒడిలోన వాలే నీ మోము నాదే

మధురాలు దోచే అధరాలు నావే

నీలో పరిమళం పెంచిందే పరవశం

నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే


కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై

గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై


ఏదేదో ఆశ కదిలింది నాలో

తెలపాలనంటే సరిపోదు జన్మ

ఏ జన్మకైనా ఉంటాను నీలో

ఏ చోటనైనా నిను వీడనమ్మ

కాలం ముగిసినా ఈ బంధం ముగియునా

నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే


కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై

గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది

నీ పేరు ప్రాణనాడి అయినదే... ఓఓఓ..

 


Share This :



sentiment_satisfied Emoticon