నెల్లూరి నెరజాణా పాట లిరిక్స్ | ఒకేఒక్కడు (1999)

 చిత్రం : ఒకేఒక్కడు (1999)

సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్      

సాహిత్యం : ఏ.ఎం.రత్నం 

గానం : హరిహరన్, మహలక్ష్మి అయ్యర్ 


నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నన్ను కొంచెం పూసుకోవే

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకోవే


నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నన్ను కొంచెం పూసుకోవే

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకోవే


ఒక కంట నీరొలకా 

పెదవెంట ఉసురొలకా

నీ వల్ల ఒక పరి జననం 

ఒక పరి మరణం అయినదీ

అరె పారేటి సెలయేరు 

అల సంద్రాన కలిసినట్టు 

గుండె నీ తోడుగా వెంటాడెలే

అరె కాలం మరిచి 

అడవి చెట్టు పూచెనులే

 

నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నన్ను కొంచెం పూసుకోవే

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకోవే


జొన్న కంకి ధూళే పడినట్టు 

కన్నులలొ దూరి తొలచితివే

తీగ వదిలొచ్చిన మల్లికవె 

ఒక మారు నవ్వుతు బదులీవే

పెదవిపై పెదవుంచీ 

మాటలను జుర్రుకొనీ 

వేళ్లతొ వత్తిన మెడపై 

రగిలిన తాపమింక పోలేదు


అరె మెరిసేటి రంగు నీది

నీ అందానికెదురేది

నువ్వు తాకే చోట తీపెక్కులే 

ఇక ఒళ్లు మొత్తం 

చెయ్యవలెను పుణ్యమునే

 

నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నన్ను కొంచెం పూసుకోవే

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకోవే

 

ఒక ఘడియ కౌగిలి బిగియించి 

నా ఊపిరాపవె ఓ చెలియా

నీ గుండె లోగిలి నే చేరా 

నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా

చినుకంటి చిరుమాటా 

వెలుగంటి ఆ చూపు 

దేహమిక మట్టిలొ కలిసి 

పోయేవరకు ఓర్చునో

ప్రాణం నా చెంతనుండంగా 

నువు మరణించిపోవుటెల

అరె నీ జీవమె నేనేనయా 

చంపదలచు మరణమైన 

మాయమయా

 

నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నన్ను కొంచెం పూసుకోవే

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకోవే


ఒక కంట నీరొలకా 

పెదవెంట ఉసురొలకా

నీ వల్ల ఒక పరి జననం 

ఒక పరి మరణం అయినదీ

అరె పారేటి సెలయేరు 

అల సంద్రాన కలిసినట్టు 

గుండె నీ తోడుగా వెంటాడెలే

అరె కాలం మరిచి 

అడవి చెట్టు పూచెనులే

 

నెల్లూరి నెరజాణా 

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడ పసుపు లాగ 

నిన్ను కొంచెం పూసుకుంటా

నీ అందెలకు మువ్వలాగ 

నన్ను కొంచెం మార్చుకుంటా

 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)