మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా పాట లిరిక్స్ | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

 చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

సంగీతం : గోపీ సుందర్ 

సాహిత్యం : సురేంద్ర కృష్ణ  

గానం : సిధ్ శ్రీరామ్  


మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..


మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళాతావే మ‌న‌సా..


ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే

అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ

త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే

అందానికే తాను ఆకాశ‌మంటూ

నువ్వే నా మాట.. హే...

నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..

తానే నీ మాట వింటుందా ఆశా


నా మాట అలుసా.. నేనెవరో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

నన్నాడిపిస్తావే మ‌న‌సా..


మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..


తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా

త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా

ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా

బ‌దులెక్కడుంద‌ంటు ప్రతి చోట వెతికా

త‌న‌తో ఉండే... హే....

తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 

మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా


నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..


మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)