మెల్లగా మెల్లగా దారులే మారెనా పాట లిరిక్స్ | తెల్లవారితే గురువారం (2021)

 చిత్రం : తెల్లవారితే గురువారం (2021)

సంగీతం : కాలభైరవ 

సాహిత్యం : రఘురామ్  

గానం : కాలభైరవ, సాహితి చాగంటి


మెల్లగా మెల్లగా దారులే మారెనా

కొత్తగా కొత్తగా పయనమే చూపెనా

నిన్నటి ఆశే మాని రేపటి ఊసే లేని

ఆ క్షణమే ఎదురైందా రమ్మని పిలిచిందా 

చీకటి నీడను దాటి వేకువ వాకిలిలోకి 

ఊహలతో ఎగిరిందా ఇంతలో మనసిలా


అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే

ఏదో స్నేహం ఇలా 

కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే 

శ్వాసై మారేట్టుగా 

ఓఓ..! 

అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే

ఏదో స్నేహం ఇలా 

కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే 

శ్వాసై మారేట్టుగా


మెల్లగా మెల్లగా దారులే మారెనా

కొత్తగా కొత్తగా పయనమే చూపెనా

ఓ ఓ ఓఓ ఓ


ఎలా గతమొక క్షణములొ మాయం

జతై ముడిపడమన్నది ప్రాణం

కథే మలుపులు చూపిన వైనం

ఒకే అలుపెరగని ఆరాటం

ఎలా మనసుతో ముందడుగేయడం


మెల్లగా మెల్లగా దారులే మారెనా

కొత్తగా కొత్తగా పయనమే చూపెనా


అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే

ఏదో స్నేహం ఇలా 

కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే 

శ్వాసై మారేట్టుగా

ఓఓ..! అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే

ఏదో స్నేహం ఇలా 

కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే 

శ్వాసై మారేట్టుగా

ఆ గతమొక క్షణములో మాయం 

Share This :



sentiment_satisfied Emoticon