చిత్రం : విజయ రాఘవన్ (2021)
సంగీతం : నివాస్ కె.ప్రసన్న
సాహిత్యం : భాష్యశ్రీ
గానం : మాల్వి సుందరేశన్
ఇంతే దూరం నించోని
ఎంతో ప్రేమే నింపాడే
ముదురు కధే.. ఏ ఏ.. హా..
తను చూసి నవ్వకున్న
నా ఎదకు రెక్కలొచ్చే
తను మాటలాడకున్న
నా సిగ్గులే మొగ్గలేసే
తను సైగే చైకున్నా
నా మనసే జారిపడే
తన కూడా వెళ్లకున్నా
నా మాటలే తడబడే
నన్ను తిరిగి చూడలా
నే ప్రేమలో మునిగెనే
తన మనసే తెలియలా
నే మత్తులో తేలిపోయే
తను చూపే దాచినా
నా కలలే పెరిగెనే
తాను చైయే పట్టకున్నా
నే జతనై పోయెనే
తననలా చూస్తూ
పసిపిల్లలా ఎగిరా
అతనలా చూస్తే
ఆడపిల్లనై రగిలా
తననలా చూస్తూ
పసి పిల్లలా ఎగిరా
అతనలా చూస్తే
ఆడపిల్లనై రగిలా
తను చూసి నవ్వకున్న
నా ఎదకు రెక్కలొచ్చే
తను మాటలాడకున్న
నా సిగ్గులే మొగ్గలేసే
తను సైగే చైకున్నా
నా మనసే జారిపడే
తన కూడా వెళ్లకున్నా
నా మాటలే తడబడే
కళ్ళతోనే మాటలాడిన
ఆశలన్నీ ఊసులాడిన
హద్దుమీరి గంతులాడిన
అంతా నీ వల్లే
గుండెలోన ఎన్నో దాచిన
అందాలన్నీ ఆరబోసినా
ఇవ్వాలని నీకే వచ్చినా
ఇవ్వ లేక లోనే దాచినా
గడియారం ముల్లై
నీ వెనకే నడిచిన
ఘడియైనా నిను వీడి
ఉండలేక పోయిన
వశం చేసే మంత్రగాడి
కోసము చూస్తున్న
కౌగిలివ్వకున్న వెంట నడవకున్న
నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్న
ఏమి తోచకున్న సర్దుకుంటుఉన్న
ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్న
కౌగిలివ్వకున్న వెంట నడవకున్న
నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్న
ఏమి తోచకున్న సర్దుకుంటుఉన్న
ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్న
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon