జగమే మాయ బ్రతుకే మాయ పాట లిరిక్స్ | సంసారం ఒక చదరంగం (1987)

 


చిత్రం : సంసారం ఒక చదరంగం (1987)

సంగీతం : కె. చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు


జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనమ్మా


జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా

జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా


ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు

ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా

పాశమనే ఎదముల్లూ యమబాధమ్మా

ఆశ పాశాలు మాసే వర్ణాలే

కలగంటే తప్పు నీదేనమ్మా ఈ బాదేనమ్మా


భార్యా పుత్రులనే వలలో పడకోయి

కాసులకే నీ సుతుడు అంకితమోయి

కాసులకే నీ సుతుడు అంకితమోయి


నాది నాది అనే బంధం వలదోయి

నీ గుటకే నిర్మాలానందమోయ్

నిముషమానంద మోయ్


నీతులు చెబుతుంటే కూతురు వినదోయి

తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్

తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్

కట్టే బట్టైన మాటే వినదోయి

కాబట్టే మందు కొట్టానోయి జో కొట్టానోయి


ఇల్లూ వాకిలీ పిల్లా మేకని

బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి

శ్రమపడితే మిగిలేది బూటకమోయి

బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి


జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా

జగమే మాయ బ్రతుకే మాయ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)