సుక్కల్లే తోచావే పాట లిరిక్స్ | నిరీక్షణ (1981)

 చిత్రం : నిరీక్షణ (1981)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : ఏసుదాస్


సుక్కల్లే తోచావే

ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే


సుక్కల్లే తోచావే

ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే


పూసిందే ఆ పూలమాను నీ దీపంలో..

కాగిందే నా పేదగుండె నీ తాపంలో

ఊగానే నీ పాటలో ఉయ్యాలై..ఈ..

ఉన్నానే ఈ నాటికి నేస్తాన్నై..ఐ..

ఉన్నా ఉన్నాదొక దూరం

ఎన్నాళ్లకు చేరం.. తీరందీనేరం..


సుక్కల్లే తోచావే

ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే


తానాలే చేశాను నేను నీ స్నేహంలో

ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో

ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే..ఏ..

ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే..ఏ

ఉందా కనీళ్ళకు అర్థం

ఇన్నేళ్ళుగా వ్యర్థం.. చట్టందే రాజ్యం..


సుక్కల్లే తోచావే

ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే


సుక్కల్లే తోచావే

ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

Share This :



sentiment_satisfied Emoticon