కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు పాట లిరిక్స్ | అల్లుడుగారు (1990)

 చిత్రం : అల్లుడుగారు (1990)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : అన్నమయ్య + ??

(జొన్నవిత్తుల/జాలాది/రసరాజు/గురుచరణ్)

గానం : ఏసుదాసు, చిత్ర


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు


కుమ్మరదాసుడైన కురువరత్తినంబి

ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు

దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి

దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి

రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడూ..


కొండలలో నెలకొన్న.. గమ దని సగమా 

గగని దమ గస కొండలలో...

సగ సమ గద మని గమ 

గద మని దస నిదమగ దమగస


కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు


ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగ

ఎనలేని వేదనలో రగిలినవాడు

మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతీ

మమతలకోవెలలో మసలనివాడు

నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు

ప్రేమకి ప్రాణంవాడు శిక్షకు పాత్రుడు కాడు

ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వర కరుణతో

తోడునీడై వాణ్ణి కాపాడు నేడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

కొండలంత వరములు గుప్పెడువాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)