గలగల పారుతున్న గోదారిలా పాట లిరిక్స్ | గౌరి (1974)

 చిత్రం : గౌరి (1974)

సంగీతం : సత్యం

సాహిత్యం : దాశరథి

గానం : బాలు


గలగల పారుతున్న గోదారిలా

రెపరెపలాడుతున్న తెరచాపలా

ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా

ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..

గలగల పారుతున్న గోదారిలా 


అందాల పందిరి వేసే ఈ తోటలూ 

ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ

నాగలి పట్టే రైతులూ.. 

కడవలు మోసే కన్నెలూ

బంగరు పంటల సీమలూ.. 

చూడరా..  హే..  

          

గలగల పారుతున్న గోదారిలా

రెపరెపలాడుతున్న తెరచాపలా

ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా

ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..

గలగల పారుతున్న గోదారిలా 


దేశానికాయువు పోసే ఈ పల్లెలూ 

చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ

సత్యం ధర్మం నిలుపుటే 

న్యాయం కోసం పోరుటే

పేదల సేవలు చేయుటే 

జీవితం.. హే.. 


గలగల పారుతున్న గోదారిలా

రెపరెపలాడుతున్న తెరచాపలా

ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా

ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..

గలగల పారుతున్న గోదారిలా 

  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)